Thorrur Tahsildar Gadeela Srinivas Felicitated
ఆకేరు న్యూస్, తొర్రూరు:
ఇటీవల ఉత్తమ ప్రభుత్వ ఉద్యోగి అవార్డును అందుకున్న తొర్రూరు మండల తహసీల్దార్ గడీల శ్రీనివాస్,ని మండల రెవెన్యూ కార్యాలయంలో సోమవారం ప్రజాప్రతినిధులు, మండల ఆఫీస్ సిబ్బంది మరియు గ్రామ పంచాయతీ అధికారుల (GPO) ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా సన్మానించారు.
సమావేశంలో భాగంగా ఆఫీస్ సిబ్బంది, జీపీవోలు తహసీల్దార్ శ్రీనివాస్,కి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. మండల ప్రజలకు, రైతులకు ఆయన అందిస్తున్న నిరంతర సేవలకు గాను ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ గడీల శ్రీనివాస్, మాట్లాడుతూ… ఈ అవార్డు రావడం తన బాధ్యతను మరింత పెంచిందని తెలిపారు. సిబ్బంది అందిస్తున్న సహకారం వల్లనే మండలంలో రెవెన్యూ సేవలను సమర్థవంతంగా అందించగలుగుతున్నామని పేర్కొన్నారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో మండల కార్యాలయ రెవెన్యూ సిబ్బంది, ఆర్ఐలు, విఆర్వోలు, సర్వేయర్లు, జీపీవోలు మరియు ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
