బొల్లారం కంటోన్మెంట్ ఆస్పత్రిలో అకస్మాత్తుగా కూలిన చెట్టు భర్త మృతి.. భార్యకు తీవ్రగాయాలు
* భర్త మృతి.. భార్యకు తీవ్రగాయాలు
* బొల్లారం కంటోన్మెంట్ ఆస్పత్రిలో ఘటన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాసి పెట్టి ఉంటే.. చావు ఎలా వస్తుందో తెలియదని అంటుంటారు. అందుకు నిదర్శనమే ఈ ఘటన. చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన ఆ దంపతులపై విధి పగబెట్టినట్లుంది. ద్విచక్ర వాహనంపై ఆస్పత్రిలోపలకు వస్తుండగా.. అకస్మాత్తుగా ఓ చెట్టు వారిపై కూలింది. ఈ ఘటనలో భర్త అక్కడికక్కడే మృతి చెందాడు. భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. బొల్లారానికి చెందిన రవీందర్, సరళ దంపతులు చికిత్స నిమిత్తం బైకుపై కంటోన్మెంట్ ఆస్పత్రికి వచ్చారు. అకస్మాత్తుగా చెట్టు కూలడంతో దంపతులు దాని కింద చిక్కుకుపోయారు. తీవ్రంగా గాయపడిన వారిని కాపాడేందుకు కంటోన్మెంట్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన చర్యలు చేపట్టారు. చెట్టు కొమ్మల్ని తొలగించేలోపు రవీందర్ ప్రాణాలు కోల్పోయారు. భార్యాభర్తలు ఒకరిపై ఒకరు చెట్టు కొమ్మల కింద చిక్కుకుపోయారు. రవీందర్‌పై భారీ కొమ్మ ఒరిగిపోవడంతో తీవ్రంగా ఆందోళనతో ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన స్థానికుల్ని విషాదానికి గురి చేసింది. ఈ ఘటనలో సరళ దేవికి సైతం తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిగా మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్ లో గాంధీ ఆస్పత్రికి కి తరలించారు. సరళ దేవి ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన కంటోన్మెంట్ ఆసుపత్రికి వచ్చిన వారంతా ఆందోళన గురయ్యారు.
—————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
