నదిలో కుప్పకూలిన బ్రిడ్జీ
* నదిలో పడిపోయిన బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న వాహనాలు
అమెరికాలో ప్రమాదం
ఆకేరు : అమెరికాలో (USA ) భారీ ప్రమాదం చోటుచేసుకున్నది. మేరీలాండ్ ( Mary land ) రాష్ట్రంలోని ప్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జీ ( francis scott key bridge ) ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. బ్రిడ్జీ మీదుగా వెలుతున్న పలు వాహనాలు పటాప్స్కో నది ( Patapsco River) లో పడిపోయాయి. చాలా మంది గల్లంతు అయినట్లు తెలుస్తోంది. డాలీ అనే కార్గో షిప్ నుంచి అత్యవసర సంకేతం మేడే కాల్ ( May day call ) రావడం ఇతర శాఖల అధికారులు అప్రమత్తమయినారు. బ్రిడ్జీకి కొంత దూరంలో ఉన్నప్పుడే కార్గో షిప్ కంట్రోల్ తప్పిందంటున్నారు. దీంతో షిప్ సిబ్బంది అత్యవసర సంకేతాలు పంపారంటున్నారు. దీని వల్లనే మరింత ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు. సహాయ చర్యలు జరుగుతున్నాయి. మృతుల వివరాలు అధికారికంగా ఇంకా వెల్లడి కాలేదు.
—————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
