* కాజిపేట జంక్షన్ లో హాల్టింగ్
ఆకేరున్యూస్, హైదరాబాద్ : సికింద్రబాద్-నాగ్పూర్ మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు ఈ నెల 15వ తేదీ నుంచి నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ రైలు ప్రతిరోజు ఉదయం 7.20 గంటలకు నాగ్ పూర్ నుంచి బయల్దేరి మధ్యాహ్నం 12.15 గంటలకు సికింద్రబాద్ చేరుకోనుంది.
తిరిగి మధ్యాహ్నం ఒంటి గంటకు సికింద్రబాద్ నుంచి బయల్దేరి రాత్రి 8.20గంటలకు నాగ్పూర్ చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ఈ రైలుకు సేవాగ్రామ్, చంద్రపూర్, బల్లార్ష, రామగుండం, కాజిపేటలో హాల్టింగ్ ఉంటుందని చెప్పారు.
——————————–