Wardhannapet Library Condition
* ప్రాణాలు గుప్పిట్లో..చదువులు
ఆకేరు న్యూస్, వర్ధన్నపేట: వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలోని స్థానిక శాఖాగ్రంథాలయం (Library) తీవ్ర శిథిలావస్థకు చేరింది. భవనం ఏ క్షణంలో కూలిపోతుందో తెలియక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్థులు తీవ్ర భయాందోళన నడుమ చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది.
* నోటిఫికేషన్ల వేళ పెరుగుతున్న తాకిడి..
ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్లు వెలువడుతుండటంతో, రోజూ పదుల సంఖ్యలో నిరుద్యోగులు, విద్యార్థులు ఈ గ్రంథాలయానికి వస్తున్నారు. అయితే, తీవ్రంగా దెబ్బతిన్న భవనాన్ని చూసి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని అధ్యయనం చేయాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
* పగుళ్లు వారిన గోడలు.. ఊడిపడుతున్న పెచ్చులు
భవనం గోడలకు పెద్ద ఎత్తున పగుళ్లు రావడం, సీలింగ్ సిమెంట్ పెచ్చులు ఊడి కింద పడుతుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని అభ్యర్థులు వణికిపోతున్నారు. ప్రాథమిక సౌకర్యాలు కూడా కరువైన వాతావరణంలో చదువుకోలేక, అలాగని ఇంటి వద్ద వనరులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
* ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి..
ఈ పరిస్థితిపై అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి శిథిలమైన గ్రంథాలయ భవనాన్ని తక్షణమే పునర్నిర్మించాలని అభ్యర్థులు కోరుతున్నారు. నూతన భవన నిర్మాణం పూర్తయ్యే వరకు నిరుద్యోగుల చదువులకు ఎలాంటి ఆటంకం కలగకుండా తాత్కాలికంగా వేరే భవనంలో గ్రంథాలయాన్ని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
