ఆకేరు న్యూస్, డెస్క్:సాధారణంగా రైలు ప్రయాణాల్లో కిటికీ పక్కన సీటు కోసమో లేదా లగేజీ సర్దుకోవడం కోసమో చిన్నపాటి వాగ్వాదాలు జరగడం మనం చూస్తుంటాం. కానీ, తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. కేవలం ఒక సీటు కోసం ఇద్దరు మహిళలు ఏకంగా ‘కుస్తీ’ పోటీకి దిగారు.రైలు బోగీలో సీటు విషయంలో ఇద్దరు మహిళల మధ్య మొదట మాటల యుద్ధం మొదలైంది. అది కాస్తా ముదిరి ఒకరినొకరు నెట్టుకునే వరకు వెళ్ళింది. కోపం కట్టలు తెంచుకోవడంతో, ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని రణరంగం సృష్టించారు. రైలు కదులుతున్నా లెక్కచేయకుండా కిందపడి మరీ కొట్టుకున్నారు.వీరి గొడవ చూసి పక్కనే ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. అక్కడే ఉన్న ఇద్దరు పురుషులు వారిని విడదీయడానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, ఆ మహిళలు మాత్రం పట్టు వదల్లేదు. వారి ఆవేశం చూస్తుంటే అక్కడ సీటు గొడవ కంటే ఈగో గొడవే ఎక్కువ కనిపిస్తోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.సోషల్ మీడియాలో వైరల్..ఈ దృశ్యాలను ఎవరో మొబైల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు”ఇది రైలు ప్రయాణమా అని ఒకరు.. “సీటు కోసం ఇంత రచ్చ అవసరమా?” అని మరొకరు కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి ఈ ‘రైలు యుద్ధం’ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ప్రయాణాల్లో సంయమనం పాటించాలని, ఇలాంటి ఘటనలు ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగిస్తాయని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.
………………………………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
