* ఎక్స్ వేదికగా ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ సంచలన ఆరోపణలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ నేత ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveenkumar) సంచలన ఆరోపణలు చేశారు. ఆయన మానసిక స్థితి మీద నాకు సీరియస్ డౌట్స్ ఉన్నయ్.. నాకే కాదు, యావత్తు తెలంగాణ కు అనుమానాలు ఉన్నాయి.. అని పేర్కొన్నారు. ఆయన ఆలోచనలు, మాటలు, చేతలు యాంటీ పర్సనాలిటీ డిజార్డర్ (Anti-Social Personality Disorder(APD), బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ (Borderline Personality Disorder(BPD), లేదా బైపోలార్ డిజార్డర్ (Bipolar Disorder) రోగి లక్షణాలు గా కనిపిస్తున్నాయని విమర్శించారు. సీఎం బాధ్యతలు ఎవరికైనా తాత్కాలికంగా అప్పజెప్పి రేవంత్ రెడ్డిని ఎర్ర గడ్డలో ఉన్నమెంటల్ హాస్పిటల్ లేదా ఆశా హాస్పిటల్ లేదా చేతన హాస్పిటల్లో ఉన్న క్వాలిఫైడ్ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్‌కు చూపిస్తే బాగుంటుందేమో ఆలోచించాలని వారి కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
……………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
