వైసీపీ అధినేత జగన్
* వైసీపీ ఎంపీలకు జగన్ దిశా నిర్దేశం
* కచ్చితంగా తిరిగి ప్రజల విశ్వాసం పొందుతామని వెల్లడి
* రాజ్యసభ, లోక్సభ ఎంపీలతో సమావేశం
ఆకేరున్యూస్, విజయవాడ : కచ్చితంగా తిరిగి ప్రజల విశ్వాసం పొందుతామని వైసీపీ అధినేత జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ ఎంపీలతో సమావేశమైన జగన్ వారికి దిశా నిర్దేశం చేశారు. ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితులు తాత్కాలికమని, మనలో పోరాటపటిమ తగ్గకూడదని తెలిపారు. ప్రజల ముందు తలెత్తుకునేలా ఎంపీలు పోరాడాలని సూచించారు. మన పాలన, చంద్రబాబు పాలనను ప్రజలు గమనిస్తారని పేర్కొన్నారు. పార్లమెంటరీ పార్టీ నేతగా వైవీ సుబ్బారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. రాజ్యసభలో పార్టీ నాయకుడిగా విజయసాయి, లోక్సభలో మిథున్ రెడ్డి పార్టీ నాయకులుగా కొనసాగుతారని తెలిపారు. ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటానని, ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోకూడదని రాజ్యసభ, లోక్సభ ఎంపీలకు జగన్ వెల్లడించారు.
————————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
