తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : గ్రూప్-2 (GROUP- II) అభ్యర్థులకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( TGPSC) శుభవార్త తెలిపింది. దరఖాస్తుల సమర్పణలో పొరపాట్లు జరిగితే సరిచేసుకునే అవకాశం కల్పించింది. తమ దరఖాస్తులను ఎడిట్ (Edit) చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ టీజీపీఎస్సీ ( TGPSC) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 16వ తేదీ నుంచి 20వ తేదీ సాయంత్రం 5 గంటలకు దరఖాస్తులను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఇక భవిష్యత్లో ఎడిట్ ఆప్షన్ (Edit option) కు అవకాశం ఉండదని, ఇదే చివరి అవకాశమని, ఎవరైనా అభ్యర్థులు తప్పిదాలు చేస్తే సరి చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుల ఎడిట్ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా తమ దరఖాస్తును పీడీఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోవాలన్నారు.
————————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
