గుంటిపల్లి సౌమ్య
* రోడ్డు ప్రమాదం లో మృతి
* గ్రామంలో విషాదం
ఆకేరు న్యూస్ , డెస్క్ :
అమెరికాలో తెలంగాణ యువతి గుంటిపల్లి సౌమ్య ( 24 ) మృతి చెందింది. బంధువుల కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి పల్లెకు చెందిన సౌమ్య అమెరికా లోని
అట్లాంటా యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతోంది .
ఆదివారం రాత్రి న్యూయార్క్ రోడ్డు పక్క నుంచి నడుచుకుంటూ వెళుతుండగా వేగంగా వెనుక నుంచి వచ్చిన వాహనం సౌమ్యను ఢీకొట్టింది.
దీంతో అక్కడికక్కడే మృతి చెందింది ..
సౌమ్య తల్లిదండ్రులు కోటేశ్వరరావు, బాలమణి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సౌమ్య మృతదేహన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
————————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
