Kamalapur Tractor Driver Seshu Kumar Murder
ఆకేరు న్యూస్, ములుగు:
ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపూర్ గ్రామంలోని రాంనగర్ రహదారి వైపు గల ఘట్టమ్మ గుడి సమీపంలో తాటి శేషు కుమార్( 35 ) అనే ట్రాక్టర్ డ్రైవర్ బుధవారం అర్ధరాత్రి హత్యకు గురైన సంఘటన జరిగింది. వివరాల ప్రకారం మంగపేట మండలంలోని నరసింహసాగర్ పంచాయతీ పరిధిలో గల గొందిగూడెంకు చెందిన శేషు కుమార్ శనగకుంట చెందిన పసుల లక్ష్మయ్య కూతురు రాధికను వివాహం చేసుకొని జీవిస్తున్నాడు. ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్న శేషు కుమార్ రెండు నెలల క్రితం కమలాపురం లోని ఓ రైతు వద్ద ట్రాక్టర్ నడిపేందుకు వెళ్లాడు. అయితే శేష్ కుమార్ కొంతమంది కూలీలతో కలిసి కమలాపూర్ గ్రామంలోని రాంనగర్ రోడ్డులోని ఘట్టమ్మ గుడి సమీపంలో ఓ పాత పెంకుటిల్లులో ఉంటున్నారు. అయితే బుధవారం శేషు కుమార్ ,కొప్పుల నరసింహారావులు మద్యం మత్తులో గొడవ పడ్డారు. అయితే క్షణికావేశముతో నరసింహారావు శేషు కుమార్ ను గొడ్డలితో నరికి చంపారు. దీంతో సమీప కూలీలు పోలీసులకు సమాచారం అందించడంతో మంగపేట ఎస్సై సూరి సంఘటన స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసుకుని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
