* క్వాష్ పిటిషన్ అత్యవసర విచారణకు నో
* 15న విచారిస్తామన్న చీఫ్ జస్టిస్ ఖన్నా
ఆకేరు న్యూస్, న్యూఢిల్లీ: కేటీఆర్కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఆయన వేసిన క్వాష్ పిటిషన్ను శుక్రవారం విచారణకు తీసుకునేందుకు చీఫ్ జస్టిస్ నిరాకరించారు. ఈనెల 15న సుప్రీంలో కేటీఆర్ క్వాష్ పిటిషన్పై విచారణ జరుగనుంది. 15న విచారణకు లిస్ట్ చేసినందున అదే రోజు విచారిస్తామని సీజే స్పష్టం చేశారు. అప్పటి దాకా కేటీఆర్ క్వాష్ పిటిషన్ను విచారించాల్సిన అవసరం లేదన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు… కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ను కొట్టివేసిన విషయం తెలిసిందే… అలాగే మధ్యంతర ఉత్తర్వులను కూడా హైకోర్టు కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్ను దాఖలు చేశారు. అత్యవసరంగా విచారణకు తీసుకోవాలని కేటీఆర్ తరపు న్యాయవాదులు కోరినప్పటికీ సుప్రీం కోర్టు సీజేఐ నిరాకరించారు.
……………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
