* నెక్నాంపూర్లో ఉద్రిక్త వాతావరణం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : చెరువుల పరిరక్షణే లక్ష్యంగా హైదరాబాద్ పరిధిలో హైడ్రా(HYDRA) కూల్చివేతలను కొనసాగిస్తోంది. చెరువు ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లలోని నిర్మాణాలను కూల్చివేస్తోంది. తాజాగా ఈరోజు నెక్నాంపూర్(NEKNAMPUR) పరిధిలో కూల్చివేతలు చేపట్టింది. పెద్ద చెరువు ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ లో నిర్మించిన విల్లాల(VILLAS)ను కూల్చివేస్తోంది. ఇప్పటి వరకు 4 విల్లాలను హైడ్రా సిబ్బంది కూల్చివేసినట్లు తెలిసింది. ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లో అక్రమంగా 13 విల్లాలను నిర్మించినట్లు హైడ్రా గుర్తించింది. దీంతో వాటి కూల్చివేతలు కొనసాగుతోంది. కూల్చివేతల సందర్భంగా నెక్నాంపూర్ లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసుల సహకారంతో హైడ్రా కూల్చివేతలను కొనసాగిస్తోంది.
……………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
