Published:
Updated: 16 Jan 2025 • 09:28 AM
ఆకేరున్యూస్, వరంగల్ : ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు మిర్చి, పత్తి పోటెత్తింది. వరుస సెలవుల అనంతరం వారం రోజుల తర్వాత మార్కెట్ యార్డు తెరుచుకోవండతో తమ పంటలను విక్రయించేందుకు రైతులు తరలివచ్చారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాల్లోని పత్తిని విక్రయించాలని మార్కెట్ అధికారులు సూచించారు. కాగా.. 2 సంవత్సరాల నుంచి మిర్చి పండిరచే రైతులకు ఆశించినంత ధరలు రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని.. ధరలు ఇలాగే ఉంటే ఇక వ్యవసాయం చేయడం దండగే అని రైతులు పేర్కొంటున్నారు.
……………………………………..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
