Medaram Jampanna Stream Missing
ఆకేరు న్యూస్ ,ములుగు :
ములుగు జిల్లా, తాడ్వాయి మండలం మేడారం లో జంపన్న వాగులో స్నానానికి వెళ్లిన కారు డ్రైవర్ ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం కొండమడుగు గ్రామానికి చెందిన తిమ్మయ్య (40) భక్తులను కారులో మేడారానికి తీసుకొచ్చాడు. అక్కడ తన స్నేహితులను కలిసి అనంతరం జంపన్న వాగులో స్నానం చేసేందుకు దిగాడు. ఈ క్రమంలో నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. స్నేహితులు రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
