* కమీషన్లకు కేరాఫ్ గంగుల : సునీల్‌రావు
ఆకేరు న్యూస్, కరీంనగర్ : కరీంనగర్లో బీఆర్ ఎస్ (Brs)కు రాజకీయంగా గట్టి దెబ్బతగిలింది. ఆ పార్టీ మేయర్ సునీల్ రావు(Mayor Sunilrao) బీజేపీ గూటికి చేరారు. ఆయనతో పాటు కార్పొరేటర్లు స్వప్న, శ్రీదేవి కూడా బీజేపీలో చేరారు. బీజేపీ(Bjp) స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay)కాషాయ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మేయర్ సునీల్ రావు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Gangula Kamalakar)పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆయనకు కమీషన్లు ముడితే చాలు.. పనుల గురించి ఎవరూ పట్టించుకోరని ఆరోపించారు. కరీంనగర్లో జరిగిన ప్రతీ కుంభకోణంలో గంగుల పాత్ర ఉందన్నారు. కరీంనగర్ అభివృద్ధిని గంగుల ఏనాడూ పట్టించుకోలేదన్నారు. రోడ్లు, చెక్ డ్యాముల కాంట్రాక్టర్లు అందరూ గంగుల బినామీలే అన్నారు. నగరాభివృద్ధి ఆగిపోకూడదనే ఇంతకాలం మౌనంగా ఉన్నానని తెలిపారు. కరీంనగర్ (Karimnagar)కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగురవేస్తామని చెప్పారు. త్వరలోనే మరికొందరు కార్పొరేటర్లు బీజేపీలో చేరతారని వెల్లడించారు. బండి సంజయ్ కృషితోనే కరీంనగర్ అభివృద్ధి చెందిందని తెలిపారు.
……………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
