* రెండు అంతస్తుల్లో ఎగిసిపడుతన్న మంటలు
* మంటలు ఆర్పుతున్న అగ్ని మాపక సిబ్బంది
* హుటాహుటిన అక్కడకు చేరుకున్న మంత్రి కొండా సురేఖ
ఆకేరు న్యూస్ , వరంగల్ : వరంగల్ లోభారీ అగ్ని ప్రమాదం జరిగింది. నగరం నడిబొడ్డున ఉన్న పోచమ్మ మైదాన్ సెంటర్ వద్ద జకోటియా కాంప్లెక్స్ లో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం సంభవించింది. జకోటియా కాంప్లెక్స్ లో కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు ఉన్నాయి. మొదటి అంతస్తులో మొదలైన మంటలు రెండు, మూడో అంతస్తులకు ఎగబాకాయి. దీంతో పోలీసులు పరిసర ప్రాంతాల ప్రజలను దగ్గరకు రాకుండా నిలువరించారు. కాంప్లెక్స్‌లోని ఇతర షాపుల్లో ఉన్న సిబ్బందిని , ప్రజలను అక్కడినుంచి వెంటనే తరలించారు. సమాచారం అందుకున్న మంత్రి కొండా సురేఖ అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
