Hanamkonda Electric Shock Boy Death
*ఎర్త్ వైరు తగిలి మూడేళ్ల బాలుడు మృతి
*చిన్నారి మృతితో వీరభద్రనగర్లో నిశ్శబ్దం
ఆకేరు న్యూస్, హన్మకొండ:
హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వీరభద్రనగర్లో తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద ప్రమాదవశాత్తు ఎర్త్ వైరు తగిలి మూడేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరభద్రనగర్ గ్రామానికి చెందిన బానోతు సంపత్ కుమారుడు రిషి (3) ఆడుకుంటూ సమీపంలో ఉన్న నూతన ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో బాలుడికి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు చెందిన ఎర్త్ వైరు తగలడంతో తీవ్రమైన విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
కళ్లముందే చిన్నారి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో వీరభద్రనగర్లో శోకసంద్రం అలుముకుంది. నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ వద్ద సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
—————-

Please tell us what is wrong. Your report will be sent to the website team.
