* ఎక్స్ వేదికగా జానిమాస్టర్ ట్వీట్
ఆకేరున్యూస్, హైదరాబాద్: టాలీవుడ్ టాప్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారారు. జూనియర్ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో అరెస్టై.. బెయిల్‌పై బయటకొచ్చిన ఆయన.. తాజాగా సంచలన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు సెన్సేషనల్‌గా అయింది. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న జానీ మాస్టర్.. కొన్నాళ్లు జైలు జీవితం గడిపారు. ఆ తరువాత బెయిల్‌పై బయటకొచ్చారు. కానీ, ఈ వ్యవహారంతో జానీ మాస్టర్ స్టార్ డమ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. బాధిత యువతి ‘మా’ అసోసియేషన్‌లో ఫిర్యాదు ఇవ్వడంతో.. ‘మా’ అసోసియేషన్ ఆయనపై చర్యలు తీసుకుంది.
డ్యాన్స్ అసోసియేషన్ యూనియన్ అధ్యక్షుడిగా జానీ మాస్టర్ని తొలగించింది. ఆ తరువాత నేషనల్ అవార్డ్ సైతం వెనక్కి తీసుకున్నారు. అయితే, జానీ మాస్టర్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించిన క్రమంలో మా అసోసియేషన్ కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నికలు నిర్వహించింది. ఈ ఎన్నికలపై జానీ మాస్టర్ కోర్టును ఆశ్రయించారు. ఇక్కడ కూడా జానీ మాస్టర్‌కు ఎదురు దెబ్బ తగిలింది. పిటిషన్‌ను కొట్టేసింది. ఈ క్రమంలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు కోర్టు తీర్పును వక్రీకరించి ప్రచారం చేస్తున్నారంటూ జానీ మాస్టర్ రియాక్ట్ అయ్యాడు. వారి తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ.. ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
…………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
