* ఉద్రిక్తంగా జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం
* ఎన్నడూలేని రీతిలో సభ్యుల మధ్య వాగ్వాదం
* జీహెచ్ ఎంసీ వద్ద 300 మందితో పోలీసు భద్రత
* చర్చ లేకుండానే బడ్జెట్‌కు ఆమోదం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం (GHMC COUNCIL MEETING) ఆరంభంలోనే రభస మొదలైంది. మన్మోహన్ సింగ్‌కు నివాళి అనంతరం.. హాట్ హట్ గా కౌన్సిల్ వాతావరణం మారింది. ఉదయం బడ్జెట్, మధ్యాహ్నం ప్రజాసమస్యలపై చర్చ జరగనుండగా.. ఉదయమే అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం మొదలైంది. ఫిరాయింపులపై బీఆర్ ఎస్(BRS) నిరసన మొదలుపెట్టింది. మేయర్(MAYOR), డిప్యూటీ మేయర్ల (DEPUTY MAYOR)రాజీనామాకు డిమాండ్ చేసింది. బడ్జెట్ పై చర్చించాలని మేయర్ చెబుతున్నప్పటికీ ఆందోళనలు ఆగలేదు. దీంతో మేయర్ సమావేశాన్ని 5 నిమిషాలు వాయిదాలు వేసింది. ఆ తర్వాత చర్చ లేకుండానే బడ్జెట్ కు ఆమోదం తెలిపారు. దీనిపై విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టాయి. మార్షల్స్ వారిని బయటకు ఎత్తుకెళ్లగా.. పోలీసులు వ్యానులోకి ఎక్కించారు. సమావేశాల నేపథ్యంలో దాదాపు 300 మంది పోలీసులతో జీహెచ్ ఎంసీ వద్ద భద్రత ఏర్పాటు చేశారు. ప్రజా సమస్యలపై చర్చించాలని పట్టుబట్టిన కార్పొరేటర్లను అరెస్ట్ చేయడంపై బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేయర్ తీరును కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఖండించారు.
భిక్షాటన చేస్తూ నిరసన
జీహెచ్ ఎంసీ కార్యాలయం వద్ద బీజేపీ నేత శ్రవణ్ (BJP LEADER SRAVAN) ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. బొచ్చు చేత్తో పట్టుకుని భిక్షాటన చేశారు. డివిజన్ల వారీగా కార్పొరేటర్లకు నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిధులు లేక.. అభివృద్ధి పనులు జరగడం లేదన్నారు.
……………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
