* అమెరికా వాషింగ్టన్లో విషాదం
* పోటోమాక్ నదిలో పడ్డ విమాన శకలాలు
ఆకేరు న్యూస్, డెస్క్ : అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. గగనతంలోనే అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని(American Airlines plane) హెలికాప్టర్ ఢీ కొట్టడంతో విమానం కూలిపోయింది. పోటోమాక్ నదిలో విమాన శకలాలు పడ్డాయి. కూలిపోయిన విమానంలో 60 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 24 మృతదేహాలు బయటపడ్డాయి. విమాన శకలాలు పడిన పోటోమాక్ నదిలో ఉష్ణోగ్రత -1 నుంచి -2 సెల్సియస్ మధ్య ఉండడంతో ఎవరూ బతికే అవకాశం ఉండదని అధికారులు, నిపుణులు భావిస్తున్నారు. భారతతస్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఉదయం 7.30 గంటలకు) రోనాల్డ్ రీగన్ వాషింగ్టన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని 33వ రన్‌వేకి దగ్గరవుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) తెలిపింది. పోటోమాక్ నదిలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
…………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
