* ఉండవల్లిలో ప్రారంభించిన మంత్రి లోకేశ్
ఆకేరు న్యూస్, ఉండవల్లి : పౌరసేవలను సులభతరంగా అందించేందుకు దేశంలోనే తొలిసారిగా ఏపీ ప్రభుత్వం వాట్సప్ గవర్నెన్స్ (watsup Governens) ఋలొకు శ్రీకారం చుట్టింది. వాట్సాప్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ సేవలను ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేశ్ (Minister Lokesh) ప్రారంభించారు. దీని కోసం అధికారిక వాట్సప్ నంబర్ 919552300009 ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. మొదటి విడతలో 161 సేవలను అందించనున్నట్లు లోకేశ్ తెలిపారు. ఎంఓయూ చేసుకున్న మూడు నెలల 9 రోజుల్లో ఈ సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రజలకు నిర్ణీత సమయానికి సేవలు అందించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.
యువగళం పాదయాత్రలో అనేక వర్గాలను కలిశానని, సర్టిఫికెట్ల విషయంలో కొన్ని ఇబ్బందులను తన దృష్టికి తెచ్చారని తెలిపారు. వాటికి పరిష్కారం తెస్తున్నామన్నారు. వాట్సప్ సేవల ద్వారా ఫేక్ సర్టిఫికెట్ల సమస్య ఉండదన్నారు. రెవెన్యూ, సీఎంఆర్ ఎఫ్, ఎండోమెంట్స్, ఆర్టీసీ, ఎనర్జీ, అన్నా క్యాంటీన్ తదితర సేవలను వాట్సప్ గ్రూపులో చేర్చామన్నారు. టీటీడీ(ttd) లో కూడా వాట్సాప్ సేవలను ప్రారంభిస్తామన్నారు. రెండో విడతలో 360 సేవలను ప్రారంభిస్తామన్నారు. వాట్సాప్ సేవల్లో ఎక్కడైనా అంతరాయం కలిగితే ప్రభుత్వమే ప్రజకు ఫోన్ చేస్తుందన్నారు. ఇందుకోసం మెటా(Meta)తో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ ఒప్పందం చేసుకుంది.
…………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
