* ఇన్నోవేషన్.. ఇన్ క్లూషన్.. ఇన్వెస్ట్ మెంట్ తో దూసుకెళ్తున్నాం
* సంపూర్ణ బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం
* పార్లమెంట్ సమావేశాల ముందు నరేంద్ర మోడీ
* గుర్రపు బగ్గీలో పార్లమెంట్ కు రాష్ట్రపతి
ఆకేరు న్యూస్ డెస్క్ : పార్లమెంట్లో సంపూర్ణ బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (NARENDRA MODI)తెలిపారు. ఈ బడ్జెట్ ప్రజల్లో కొత్త విశ్వాసం నింపుతుందని భరోసా ఇచ్చారు. భారత్ అభివృద్ధి లక్ష్యంతో మిషన్ మోడన్ లో ముందుకెళ్తున్నామన్నారు. ఇన్నోవేషన్(INNOVATION), ఇన్ క్లూషన్(INCLUTION), ఇన్వెస్ట్ మెంట్(INVESTMENT) విధానాల్లో దూసుకెళ్తున్నామన్నారు. కొత్త విధానాలతో ఆర్థిక ప్రగతి ఆధారపడి ఉంటుందన్నారు. పార్లమెంట్ లో చరిత్రాత్మక బిల్లులు ప్రవేశపెడుతున్నట్లు మోడీ వెల్లడించారు.
సహృద్బావంతో చర్చలు జరగాలని ఆకాంక్షించారు. మహాలక్ష్మి బుద్దిని, సిద్దిని ఇస్తుందన్నారు. పేదలు, సామాన్యులపై మహాలక్ష్మి కృప ఎల్లప్పుడూ ఉండాలన్నారు. భారత శక్తి సామర్థ్యాలు మనకు విశేష గుర్తింపునిస్తాయని తెలిపారు. పార్లమెంటు (PARLIAMENT) బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఆర్ధిక మంత్రిగా నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman)వరుసగా ఎనిమిదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు ఉభయసభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(Murmu) ప్రసంగిస్తారు. రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంట్‌కు గుర్రపు బగ్గీలో రాష్ట్రపతి వచ్చారు.

………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
