ఆకేరు న్యూస్, స్పోర్ట్స్ డెస్క్ : భారత్, న్యూజిలాండ్ (India Vs Newzland)మధ్య చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ శాంటర్న్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కివీ జట్టులో ఒక మార్పు చేసింది. గాయం కారణంగా మాట్ హెన్నీ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో ఫాస్ట్ బౌలర్ నాథన్ స్మిత్‌కు అవకాశం కల్పించింది. భారత టాస్ కోల్పోవడం వరుసగా ఇది 15వసారి. టీమిండియా సెమీస్‌లో ఆస్ట్రేలియాతో బరిలోకి దిగిన జట్టుతోనే ఆడనున్నది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యా కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అతను మొదటి బంతిని వైడ్ గా బౌలింగ్ చేయగా, రచిన్ రవీంద్ర ఓ పరుగుతో తన ఖాతా తెరిచాడు. 6 ఓవర్లు ముగిసేసరికి 46 రన్స్ న్యూజిలాండ చేసింది. రచిన్ రవీంద్ర దూకుడుగా ఆడుతున్నాడు. కాగా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ (Champions Trophy Final) లో భారత్ గెలవాలని దేశ వ్యాప్తంగా అభిమానులు పూజలు చేస్తున్నారు. భారత్ గెలవాలని వారణాసిలో పూజలు చేశారు. స్వామి చిదానంద సరస్వతి రుషికేషిలో పూజలు చేశారు. భారత్ గెలుపు కోసం అయోధ్యలోనూ సాధువులు పూజలు చేశారు. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణేశ్ (Khairathabad Ganesh) ఉత్సవ సమితి కూడా పూజలు నిర్వహించింది.
ఆయా జట్లు ఇలా..
న్యూజిలాండ్ జట్టు
విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), కైల్ జామిసన్, విలియం ఓ రూర్కే, నాథన్ స్మిత్.
భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
