-2025లో జిల్లా ముందంజ లో ఉండాలి
-జిల్లా కలెక్టర్ రిక్ష్వాన్ భాషా షేక్
ఆకేరు న్యూస్, జనగామ: స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ 2025 లో జిల్లా ను దేశంలో అగ్రగామిగా నిలపాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కోరారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో అన్ని మండలాల MPDO, MP0, Apms, APO, అన్ని పంచాయితీ కార్యదర్శులకి ఎస్.ఎస్.జి-2025 పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ ప్రతీ గ్రామంలో చెత్త సేకరణ, వ్యర్థాల నిర్వహణ, పారిశుధ్య కార్మికుల పనితీరు బాగుండాలన్నారు. ఎక్కడ నీరు నిల్వ ఉండకుండా సరైన పారిశుద్ధ్య నిర్వహణకు ప్రతీ గ్రామానికి 20 చొప్పున ఇంకుడు గుంతలను నిర్మించాలన్నారు. ఎస్.ఎస్.జి(జి) పారామీటర్స్ అన్నీ సరిగా ఉండేలా ప్రతి పౌరుని ద్వారా SBM (G) SSG-2025 mobile App ద్వారా సిటిజన్ feedback ఇచ్చేలా కృషి చేసి జిల్లా ప్రతిష్టని నిలపాలని కలెక్టర్ తెలిపారు. అనంతరం స్వచ్ఛ సర్వేక్షన్ కి సంబందించిన పోస్టర్ ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయితీ అధికారిణి స్వరూప, డి.ఎల్.పి.ఓ వెంకట్ రెడ్డి, SBM- DC కర్ణాకర్ తదితరులు పాల్గోన్నారు.
…………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
