* ముహూర్తం ఖరారు
ఆకేరున్యూస్, హైదరాబాద్: అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు(GUVVALA BALARAJU) బీజేపీ(BJP)లో చేరే ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 11న గువ్వల బాలరాజు బీజేపీలో చేరనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రకటించారు. హైదరాబాద్ లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన పార్టీ నేతల సమక్షంలో బీజీపీలో చేరనున్నారు.ఇప్పటికే ఆయన బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపారు. ముఖ్యంగా ఈ రోజు,బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (RAMCHANDER RAO)) తో హైదరాబాద్లో భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు జరిగిన ఈ భేటీలో రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం.గత కొంతకాలంగా బీఆర్ఎస్ లో కొనసాగుతున్న అసంతృప్తి చివరకు పార్టీకి గుడ్ బై చెప్పే స్థాయికి తీసుకెళ్లింది.గువ్వల బాలరాజు మాట్లాడుతూ, బీఆర్ఎస్ లో తాను ఆశించిన గౌరవం, ప్రాధాన్యం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన రాజకీయంగా పార్టీ కోసం ఎంతగానో కృషి చేసినప్పటికీ, తనకు సరైన గుర్తింపు రాలేదని తెలిపారు. ప్రజల సమస్యలపైనే దృష్టి పెట్టాలని తాను పలుమార్లు నాయకత్వాన్ని కోరినప్పటికీ, స్పందన లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు.
………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
