
* 125 నుండి 11 కు చేరిన నక్సల్ ప్రభావిత జిల్లాల సంఖ్య
* అభివృద్ధికి నోచుకోని నక్సల్స్ ప్రభావిత జిల్లాలు
* కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ : ఇక ముందు దేశంలో నక్సలిజానికి తావు లేదని మార్చి 31, 2026 నాటికి దేశంలో నక్సలిజం పూర్తిగా తుడిచి వేస్తామని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్ లో హైదరాబాద్ లో కిషన్ రెడ్డి నక్సల్స్ అంశం, ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి పై ఆయన మాట్లాడారు. గత మూడు రోజులుగా 300 మంది నక్సల్స్ లొంగిపోయారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ మంచి ఫలితాలను ఇస్తోందన్నారు. నక్సలైట్లు స్వచ్ఛందంగా జన జీవన స్రవంతిలో కలువడం విశేషమన్నారు ఉందన్నారు. దేశ వ్యాప్తంగా 125 జిల్లాల్లో నక్సల్స్ ప్రభావం ఉండేదని కేంద్ర ప్రభుత్వం ధృడసంకల్పంతో వ్యవహరించడంతో ఆ యా జిల్లాలో సంఖ్య 11 కు చేరిందని కిషన్ రెడ్డి తెలిపారు. మిగిలి ఉన్న 11 జిల్లాల్లో కూడా నక్సలిజం లేకుండా చేస్తామన్నారు.
నక్సల్స్ ప్రభావిత జిల్లాలుగా ఉన్న జిల్లాలు ఇన్ని రోజులు అభివృద్ధికి దూరమయ్యాయని కిషన్ రెడ్డి తెలిపారు. దీపావళి పర్వదినాన ఆయా జిల్లాల్లో వెలుగులు వస్తున్నాయని అన్నారు. ఇంత కాలం ఆయా జిల్లాలు కనీస మౌలిక వసతులకు దూరంగా ఉన్నాయన్నారు. పాఠశాలలు, ఆస్పత్రులలకు కూడా నోజుకోలేదన్నారు. విద్య దూరం కావడం వల్ల వెనుకబాటు తనం పెరుగుతుందన్నారు. ఇక ముందు ఆ సమస్య ఉండదని కిషన్ రెడ్డి తెలిపారు.
………………………………………………………