రోడ్డు పక్కన దాబాలో భోజనం చేస్తున్న అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు ఫుల్ పామ్‌లో ఉన్నారు. పుష్ప సినిమా తర్వాత ఆయన రేంజ్ మరింత పెరిగింది. ప్రతిష్టాత్మక అవార్డులను సైతం సొంతం చేసుకుంటూ ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటున్నారు. అలాంటి అల్లు అర్జున్ తన సింప్లిసిటీని చాటుతూ, భార్య స్నేహారెడ్డితో కలిసి రోడ్డు పక్కన దాబాలో భోజనం చేయడం చర్చనీయాంశం అవుతోంది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇటీవల నంద్యాల వెళ్లి తిరిగొచ్చే సమయంలో దాబాలో ఫుడ్ టేస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఆయన టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో పుష్ప-2 సినిమాలో అల్లు అర్జున్ నటిస్తున్నారు. పుష్ప-1 షూటింగ్ సమయంలో కూడా ఆంధ్రాలోని మారేడుమిల్లి ప్రాంతంలోని రోడ్డు పక్కన ఓ స్టాల్లో టీ తాగిన ఫొటోలు వైరల్ అయ్యాయి.
—————————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
