ఆకేరు న్యూస్, డెస్క్ : భారత పర్యటనకు వచ్చిన అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ (Football icon) లియోనల్ మెస్సి (Lionel Messi) ఇక్కడి ఆతిథ్యానికి ముగ్దులయ్యారు. ‘గోట్ ఇండియా టూర్’లో భాగంగా నాలుగు రోజులపాటూ మెస్సీ ప్రధాన నగరాల్లో సందడి చేశారు. పర్యటన ముగియడంతో ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. భారత్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ప్రత్యేక వీడియోను పంచుకున్నారు. ఆ వీడియోలో ఏముంది అంటే.. ‘నమస్తే ఇండియా..! ఈ పర్యటనలో నాకు ఆతిథ్యం ఇచ్చిన ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, కోల్‌కతా నగరాలకు ప్రత్యేక కృతజ్ఞతలు. వెళ్లిన ప్రతీచోటా ఆత్మీయ స్వాగతం, గొప్ప ఆతిథ్యం, అఖండమైన ప్రేమ లభించింది. అందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భారత్‌లో ఫుట్‌బాల్‌కు ఎంతో భవిష్యత్తు ఉందని ఆశిస్తున్నాను’ అంటూ వీడియోకి క్యాప్షన్ రాసుకొచ్చారు.
…………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
