* రంగారెడ్డి జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : వారిద్దరూ మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నారు. జీవితాంతం కలిసి జీవించాలని అనుకున్నారు. కానీ వారి ప్రేమ.. పెళ్లికి పెద్దలు అడ్డుగోడగా నిలిచారు. దీంతో ఒకరిని విడిచి ఒకరు ఉండలేక.. ఒకరు తర్వాత మరొకరు బలన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా (Rangareddy District) యాచారంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డ జిల్లా యాచారం మండల పరిధి మేడిపల్లి గ్రామంలో పోతురాజు అలివేలు కుమార్తె పూజ (16) ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి చెందిన సిద్ధగోని యాదయ్య కుమారుడు మహేష్ (20)తో ప్రేమలో పడింది. ఇద్దరూ కొద్డి నెలలుగా ప్రేమించుకుంటున్నారు. విషయం ఇరు కుటుంబాల్లో తెలవడంతో వీరిని గత కొన్ని రోజులుగా కలుసుకోకుండా చేశారు. దీంతో ఇటీవల మహేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. విషయం తెలిసి పూజ కూడా అదే పని చేసింది. సకాలంలో ఆస్పత్రికి తరలించడంతో బతికి బయటపడ్డారు. ఆ తర్వాత కూడా పెద్దలు వారిని కలుసుకోనీయకుండా చేశారు. దీంతో మహేష్ పూజకు ఫోన్ చేసి మనం పెళ్లి చేసుకోకపోతే చనిపోతానని చెప్పాడు. మహేశ్ ఎక్కడ చనిపోతాడో అన్న భయంతో పూజే ముందుగా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పూజ చనిపోయిన విషయం తెలుసుకున్న ప్రియుడు మహేష్ కూడా బుధవారం హయత్ నగర్ (Hayathnagar) పరిధిలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ ప్రేమజంట మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
………………………………………………………………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
