* వారం రోజుల సర్టిఫికెట్ కోర్సు పూర్తి
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలో ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్సిటీలోని కెన్నెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్లో ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. లీడర్ షిప్ అనే కోర్సును పూర్తిచేసి సంబంధిత ధ్రువీకరణ పత్రాన్ని పొందారు. ఈ కోర్సులో సీఎం రేవంత్‌తో పాటు 62 మంది కోహోర్ట్ విద్యార్థులు కూడా పాల్గొన్నారు. దాదాపు 20కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు ఇందులో భాగస్వాములయ్యారు. అమెరికాలోని కేంబ్రిడ్జ్‌లో మైనస్ 24 డిగ్రీల తీవ్ర చలిలోనూ రేవంత్ రెడ్డి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తరగతులకు హాజరయ్యారు. కేస్ స్టడీలు, గ్రూప్ డిస్కషన్లు, కన్సల్టేటివ్ వర్క్‌లతో కూడిన ఇంటెన్సివ్ ప్రోగ్రామ్‌లో భాగంగా అధికారం, నాయకత్వం, సంఘర్షణలు, అనిశ్చితి వంటి అంశాలపై శిక్షణ పొందారు. ప్రోగ్రామ్ ముగిసిన సందర్భంగా హార్వర్డ్ అధ్యాపకులు రేవంత్ రెడ్డితో పాటు మిగిలిన 62 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. అయితే భారతదేశ చరిత్రలో అధికారంలో ఉండగానే హార్వర్డ్ నుంచి ఈ రకమైన సర్టిఫికెట్ పొందిన తొలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రికార్డ్ సష్టించారు.
……………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
