– పశువులకు చికిత్స, ఉచిత మందుల పంపిణీ
ఆకేరు న్యూస్, కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ పల్లె గ్రామ పాలకవర్గం, పశు వైద్య ,సంవర్ధక శాఖ సంయుక్తంగా జంతు సంరక్షణ పక్షోత్సవాలలో భాగంగా ఉచిత మెగా పశు వైద్య శిబిరాన్ని శనివారం నిర్వహించారు. పాడి పశువులను నిర్లక్ష్యం చేయకుండా, సంరక్షించుకోవాలని మండల పశువైద్యాధికారి డాక్టర్ ఏ.బాలకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా ఉప్పలపల్లి గ్రామ సర్పంచ్ ర్యాకం శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రామాల్లో పాడి పశువులు ఆవశ్యకత అత్యంత అవసరం అని, పశువుల పేడ తో వ్యవసాయం లాభసాటి గా మారుతుందని, ప్రతి రైతు రసాయన ఎరువులు వాడిన పంట ను తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని, ప్రతి ఒక్కరూ ఒక పాడి పశువును పెంచుకొని గ్రామ అభివృద్ధి కి పాటు పడాలని కోరారు.పశు వైద్య శిబిరం లో పాడిపశువులకు గర్భకోశ వ్యాధులకు చికిత్స, చూడి పరీక్ష, ఎదకు రాని పశువులకు చికిత్స, దూడలకు నట్టల నివారణ మందుల పంపిణి, బాహ్య పరన్నజీవుల నివారణకు పిచికారీ మందు, పాల దిగుబడి పెంచే మందుల పంపిణి, కోళ్ల మందులను స్పెషలిటీ వైద్యుల సమక్షంలో ఉచితంగా పంపిణి చేశారు. ఈ పశువైద్య శిబిరంలో 106 పాడి పశువులకు చికిత్స చేసి మందులను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ పశువైద్యాధికారి Dr ప్లవన్ మజందర్,ఉప సర్పంచ్ బూర్గుల నాగరాజు, గ్రామపంచాయతీ సభ్యులు ర్యాకం చిరంజీవి, అంబరగొండ శ్రీనివాస్, ఎండిగే రజిత, గోపాల మిత్ర చక్రపాణి, వెటింజ, హిమాలయ కంపెనీ ప్రతినిధులు, పశువైద్య సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
……………………………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
