రాష్ట్రవ్యాప్త గణాంకాలు ఉదయం 11 గంటల వరకు.
ఆకేరు న్యూస్ , డేస్క్ : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 28.48 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 52.17 లక్షల మంది ఓటర్లకు గానూ, ఇప్పటివరకు సుమారు 14.85 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మున్సిపాలిటీలు సగటున 30.62% ఓటింగ్ , కార్పొరేషన్లు సగటున 23.26% ఓటింగ్.చిన్న మున్సిపాలిటీల్లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
అత్యధిక ఓటింగ్: జోగులాంబ గద్వాల (47.52%), ఆలంపూర్ (40.84%), భూపాలపల్లి (45.05%), అశ్వారావుపేట (45.18%).
అల్ప ఓటింగ్: నిర్మల్ (14.30%), నారాయణఖేడ్ (11.10%), ఆలేరు (11.98%). ప్రధాన కార్పొరేషన్లలో పోలింగ్ కాస్త మందకొడిగా సాగుతోంది. మహబూబ్నగర్: 27.72%, కొత్తగూడెం: 28.46%, కరీంనగర్: 24.36%, రామగుండం: 24.31%, నిజామాబాద్: అతి తక్కువగా 18.94%….మధ్యాహ్నం సమయానికి పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
