* మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఎస్పీ.
ఆకేరు న్యూస్, ములుగు: మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకొని ములుగు జిల్లా ఎస్ పి సుధీర్ రామనాథ్ కేకాన్ బుధవారం ములుగు మున్సిపాలిటీ లో గల పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ములుగు పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల, బండారుపల్లి, జీవంతరావుపల్లి ప్రాంతాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలను సందర్శించారు . భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల అమరిక, పోలీసు బందోబస్తు, ఓటర్ల రాకపోకల నియంత్రణ తదితర అంశాలను సమీక్షించారు. స్థానిక పోలీస్ అధికారులకు ఎన్నికలు శాంతియుతంగా, నిష్పక్ష పాతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని స్థాయిల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద చట్ట విరుద్ధ కార్యకలాపాలు, డబ్బు, మద్యం పంపిణీ వంటి చర్యలపై కఠిన నిఘా ఉంచాలని, ఎన్నికల నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు.
—————————————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
