మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీఆర్ఎస్ విజయం (బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్ రెడ్డి)
* మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ విజయం
ఆకేరు న్యూస్, మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఫలితాలు వెలువడ్డాయి. మహబూబ్‌నగర్‌లోని బాలుర జూనియర్ కాలేజీలో ఓట్ల లెక్కింపు జరిగింది. మొత్తం 1,437మంది ప్రజా ప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కౌంటింగ్ కోసం అధికారులు 5 టేబుల్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్ తరపున మన్నె జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ తరపున నవీన్‌కుమార్‌రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ పోటీ చేశారు. కాగా.., మన్నె జీవన్‌రెడ్డిపై 111 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్ రెడ్డి గెలుపొందారు. నవీన్ కుమార్ కు 763, జీవన్ రెడ్డికి 652 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థికి ఒకే ఒక్క ఓటు పడింది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనే ఫలితం తేలిపోయింది. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో ఈ ఉపఎన్నిక వచ్చింది.
—————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
