ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
Published:
Updated: 06 Jul 2024 • 11:49 AM
తెలంగాణ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు
ఆకేరు న్యూస్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సోదర సోదరీమణులకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ తెలుగులో ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రం, దేశాభివృద్ధికి అందించిన సహకారం ప్రతి భారతీయునికి గర్వకారణం అని కొనియాడారు. గొప్ప చరిత్ర, విశిష్టమైన సంస్కృతి ఈ రాష్ట్ర ప్రత్యేకతలు అని అన్నారు. రానున్న రోజుల్లో ఈ రాష్ట్రాభివృద్ధికి నిరంతరం కృషి చేసేందుకు మేము కట్టుబడి ఉన్నాం అని హామీ ఇచ్చారు.
————————–
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
