*కరెంటు షాక్ తో రైతు మృతి
ఆకేరు న్యూస్ కమలాపూర్:
వ్యవసాయ పొలంలో కరెంట్ షాక్తో రైతు మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకున్నది. కమలాపూర్ పోలీస్ ఇన్స్పెక్టర్ పి. నవీన్ తెలిపిన వివరాల ప్రకారం….. కమలాపూర్ మండలం కన్నూర్ గ్రామానికి చెందిన రైతు సూదాటి కొండల్ రావు (63) గురువారం ఉదయం పొలానికి నీరు పెట్టి వస్తానని చెప్పి వెళ్లి, పొలం నుంచి ఇంటికి వస్తుండగా పొలం వద్ద ఉన్న కరెంటు ట్రాన్స్ఫార్మర్ దగ్గర ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడనీ సిఐ తెలిపారు. గమనించిన పక్క వ్యవసాయ రైతు ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వెళ్లి చూడగా చనిపోయి ఉన్నాడని సిఐ తెలిపారు. మృతుడి కుమారుడు సూదాటి రాజేశ్వరరావు ఇచ్చిన దర్యాప్తు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
