Vijay Sangeetha divorce settlement
ఆకేరు న్యూస్, డెస్క్: తమిళ స్టార్ హీరో, ‘తమిళగ వెట్రి కళగం’ అధినేత విజయ్ వ్యక్తిగత జీవితం మరోసారి హాట్ టాపిక్ అయింది. గత కొంతకాలంగా విజయ్ తన భార్య సంగీతకు దూరంగా ఉంటున్నారన్న వార్తలు కోలీవుడ్‌లో హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వీరి విడాకుల సెటిల్మెంట్కు సంబంధించి ఒక సంచలన వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
*రూ. 250 కోట్ల డిమాండ్
విజయ్ రాజకీయాల్లోకి వస్తున్న వేళ తన ఆస్తుల వివరాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ వివరాల ఆధారంగా సంగీత సుమారు రూ. 250 కోట్ల భారీ సెటిల్మెంట్ కోరినట్లు కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కేవలం తన కోసమే కాకుండా, కుమారుడు మరియు కుమార్తె భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ భారీ మొత్తాన్ని ఆమె డిమాండ్ చేసినట్లు సమాచారం.
*అంత డబ్బు ఇచ్చేందుకు నిరకరణ
అయితే, సంగీత అడిగినంత భారీ మొత్తం ఇచ్చేందుకు విజయ్ అంగీకరించలేదని తెలుస్తోంది. ఆయన కేవలం రూ. 35 కోట్లు మాత్రమే సెటిల్మెంట్గా ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. పిల్లల బాధ్యతను తానే చూసుకుంటానని, వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తానని విజయ్ హామీ ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
*రాజకీయ ఎంట్రీ వేళ ఇబ్బందులేనా?
ప్రస్తుతం విజయ్ తన పూర్తి దృష్టిని రాజకీయాలపై కేంద్రీకరించారు. ఇలాంటి సమయంలో వ్యక్తిగత వివాదాలు బయటకు రావడం ఆయన ఇమేజ్‌కు మైనస్ అవుతుందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ వార్తలపై అటు విజయ్ టీమ్ గానీ, ఇటు సంగీత కుటుంబం గానీ అధికారికంగా స్పందించలేదు. ఇవన్నీ కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలేనని కొందరు కొట్టిపారేస్తున్నారు.
