Rajaiah opposition role statement
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
ప్రజలు అప్పగించిన ప్రతిపక్ష బాధ్యత సమర్థవంతంగా నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ రజతోత్సవాల ముగింపు సందర్భంగా జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దాదాపు 14 సంవత్సరాల పాటు సాగిన ఉద్యమం, అనంతరం 10 సంవత్సరాల అధికారంలో ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించిన విషయాలను గత రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలనలోని వ్యత్యాసాన్ని గుర్తుచేశారు. రేపటి నుంచి తెలంగాణ 26వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఉద్యమకారులు, అభిమానులు మరింత చైతన్యంతో ముందుకు రావాలని సూచించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు పార్టీ పునర్నిర్మాణం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఎక్కడికక్కడ నిలదీయాలని, ప్రజా సమస్యలపై పోరాటాలు చేపట్టాలని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో రైతుల సమస్యలపై బీఆర్ఎస్ ఎప్పటికప్పుడు పోరాటం చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి విధ్వంస పాలన కొనసాగుతుందన్నారు. పెద్ద వాగు, నెట్టెంపాడు, ఎస్ ఎల్ బి సి, మేడిగడ్డ ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదన్నారు. యూరియా కొరత, నిరుద్యోగ సమస్య, ఇందిరమ్మ ఇండ్లు, ఆరు గ్యారంటీల అమలు నోచుకోక రాష్ట్ర ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారని అన్నారు. వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు సకాలంలో ఏర్పాటుచేసి రైతాంగానికి గిట్టుబాటు ధర అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు అండగా ఉండి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు మధు, రాజేశ్వర్, రమ్య రఘు నాయకులు కేశిరెడ్డి మనోజ్ రెడ్డి, కర్ర సోమిరెడ్డి, చేవెళ్ల సంపత్, కూరపాటి వెంకటేశ్వర్లు, మాలోత్ రమేష్ నాయక్, ఒగ్గు రవి, మారపాక రమేష్, హీరా సింగ్, భాగ్యలక్ష్మి, పావని, కవిత, రాజన్ బాబు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
