Telangana BJP Government 2029
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
తెలంగాణలో 2029 లో బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందని జిల్లా అధ్యక్షులు సౌడా రమేష్ అన్నారు. జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలో శనివారం మండల అధ్యక్షులు గంటె ఉపేందర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనగామ జిల్లా అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ రేపు సాయంత్రం 4 గంటలకు పెరేడ్ గ్రౌండ్స్ సికింద్రాబాద్ లో జరిగే మోడీ బహిరంగ సభ విజయవంతం చేసేందుకు భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. హైట్రిక్ విజయాలతో కేంద్రంలో వరసగా మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టి, దేశంలో 21 రాష్ట్రాలలో బిజెపి, ఎన్డీఏ ప్రభుత్వాలను అధికారంలోకి తెచ్చిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వస్తున్న సందర్బంగా జనగాం జిల్లా నుండి భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో 2029 లో బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందని. పేదల పక్షాన ఉన్న నాయకుడు మోడీ ప్రపంచ దేశాలు గర్విస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బల్ల శ్రీనివాస్, బాలనేని శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ఉమా రాణి, చిల్పూర్ మండల ప్రధాన కార్యదర్శి వెలిచాల శ్రీనివాస్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఉరటి రాజు, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కందుకూరి రజినీ, జోగులు, ముక్కెర రమేష్, రాములు, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
