Paddy Procurement Farmer Issues
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద మండుటెండలో రైతులు అష్ట, కష్టాలు పడుతున్న ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడంలేదని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య ధ్వజమెత్తారు. జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులను సమస్యలను అడిగి తెలుసుకొని ప్రభుత్వ తీరును నిరసిస్తూ రోడ్డుపై ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ రాజయ్య మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెల కావస్తున్న నేటికీ రైతులకు గన్ని బ్యాగ్స్ ఇవ్వడం లేదు, కాంట వేయడం లేదు, లారీలలో ధాన్యాన్ని తరలించడం లేదని ధ్వజమెత్తారు. కెసిఆర్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేసి రైతులకు వారి ఖాతాలలో డబ్బులు జమ చేయడం జరిగింది అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారన్నారు. నిన్న శివునిపల్లిలో వరి ధాన్యం దగ్గరికి వెళ్లి వచ్చి ఎండ దెబ్బ తగిలి ఒక రైతు మరణించిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిమ్మకు నీరతనట్లుగా వ్యవహరిస్తుందని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి రైతుల ధాన్యం కొనుగోలు చేపించకుండా, కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి రైతు మేళాలో సంబరాలు చేసుకుంటున్నాడని ఆరోపించారు. వారం రోజుల లోపు ధాన్యం మొత్తం కొనుగోలు చేయకపోతే ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు. ధర్నా కార్యక్రమంలో మండలం ఇంచార్జ్ మాలోతు రమేష్ నాయక్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కేసిరెడ్డి మనోజ్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ బత్తుల రాజన్ బాబు జిల్లా నాయకులు వలెందర్ రెడ్డి, చిల్పూర్ ఉపసర్పంచ్ రాజారపు రంజిత్ నాయకులు నారగోని రాజు, మాజీ ఉపసర్పంచ్ పిట్టల మహేందర్, నలిమెల కుమార్, సత్తయ్య, కిషన్, శేఖర్, సూర రవి రైతులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
