Paddy Transport Rice Mills
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
రైస్ మిల్లుల వద్ద వడ్ల దిగుమతిని వేగవంతం చేయాలి అదనపు లారీలను ఐకెపి సెంటర్లకు పంపాలని సిపిఎం మండల కార్యదర్శి మునిగెల రమేష్ డిమాండ్ చేశారు.
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం రాఘవపూర్ లో రోహిణి రైస్ మిల్లును సిపిఎం బృందం సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా మండల కార్యదర్శి మునిగెల రమేష్ మాట్లాడుతూ రైస్ మిల్లుల వద్ద దిగుమతిని వేగవంతం చేయాలని రైస్ మిల్లు యజమాన్యాన్ని కోరారు. లారీల కొరత బాగా ఉందని ఐకెపి సెంటర్లలో సరిగా లారీలు రావడం లేదని ప్రభుత్వం తక్షణమే స్పందించి అదనపు లారీలను కేటాయించి ధాన్యం కొనుగోలను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. జనగామ జిల్లాలో నేటికీ బియ్యం కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో రైస్ మిల్లులలో స్థలం లేక ధాన్యాన్ని దిగుమతి చేసుకోవడం లేదని రైస్ మిల్లు యజమానులు మా దృష్టికి తీసుకువచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు తోడెంగల ఐలయ్య, గట్ల మల్లారెడ్డి, పోలాసు పరమేష్ నాయకులు లింగనబోయిన కుమార్, మంద మొగిలి, లింగనబోయిన శ్రీకాంత్, సాంబరాజు, రైస్ మిల్ యజమాన్యం, హమాలీలు తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
