Karlapalli Father Son Tragedy
* దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి సీతక్క
ఆకేరు న్యూస్,ములుగు:
ములుగు జిల్లా గోవిందరావు పేట మండలం కర్లపల్లి గ్రామంలో శనివారం విషాద సంఘటన చోటు చేసుకున్నది తెలిసిన వివరాల ప్రకారం. కర్లపల్లి గ్రామానికి చెందిన రసపుత్ రాజు తన ఆవు లేగ దూడ బావిలో పడ్డాయని రాజు బావిలోకి దిగాడు వెంటనే కొడుకు అదే బావిలోకి దిగారు. అయితే తాడు సహాయంతో పైకి ఒకరి వెనకాల ఒకరు ఆ తాడును పట్టుకొని వస్తుండగా మధ్యలోకి రాగానే తాడు తెగిపోయి ఇద్దరు బావిలో పడి మృతి చెందారు. సమాచారం అందుకున్న సిఐ ఆధ్వర్యంలో బయటకు తీశారు. దింతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుమ్ముకున్నాయి.ఈ విషాద ఘటనపై మంత్రి సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బావిలో పడి తండ్రి రసపూత్ రాజు కుమారుడు పవన్ మృతి చెందడం అత్యంత బాధాకరమని ఆమె పేర్కొన్నారు.
బాధిత కుటుంబ సభ్యులను ఫోన్ ద్వారా మంత్రి పరామర్శించి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అవసరమైన సహాయ చర్యలు చేపట్టేందుకు అధికారులను ఆదేశించారు.
