ACTOR VIJAY TVK TAMILNADU GOVERNMENT
ఆకేరు న్యూస్, కమలాపూర్:
తమిళనాడులో విజయ్ TVK పార్టీకి మద్దతుగా నిలిచిన కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల బాటలోనే తాజాగా చిరుతైగళ్ కచ్చి, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీలు మద్దతు ప్రకటించడంతో విజయ్ బలం 121 కి చేరింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన నేపథ్యంలో, ప్రభుత్వ ఏర్పాటుకు అత్యవసరమైన మద్దతు లభించింది. చిరుతైగళ్ కచ్చి (VCK) అధినేత థిరుమావలవన్ , ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(IUML) ఖాదర్ మొయినుద్దీన్ లు టీవీకే కు బేషరతుగా మద్దతు ప్రకటించడంతో విజయ్ బలం 121 కి చేరింది. రాష్ట్ర అసెంబ్లీలో మెజారిటీకి కావాల్సిన 118 మార్కును టీవీకే దాటేయడంతో ప్రభుత్వ ఏర్పాటు ఖాయమైంది.
టీవీకేకు ఇప్పటికే కాంగ్రెస్ (5), సీపీఐ (2), సీపీఐ(ఎం)(2) పార్టీలు మద్దతు తో పాటుగా వీసీకే(2), ఐ యు ఎం ఎల్ (2) కూడా తోడవడంతో విజయ్ కూటమి బలం 121 కి చేరింది. ఈ పరిణామాలతో తమిళనాడులో దశాబ్దాల రాజకీయ ముఖచిత్రం మారిపోనుంది. స్వతంత్రంగా అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకే, ఇప్పుడు మిత్రపక్షాల అండతో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర గవర్నర్ నుంచి ఆహ్వానం అందిన వెంటనే విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది, ఇది తమిళ రాజకీయాల్లో ఒక సరికొత్త అధ్యాయానికి నాంది కానుంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
