Heatstroke Farm Worker Death
Published:
ఆకేరు న్యూస్,ములుగు:
మండుతున్న ఎండలకు తోడు వడగాలులతో ఏజెన్సీ మండల ప్రజలు అతలాకుతామవుతున్నారు. ఈ క్రమంలోనే ములుగు జిల్లా మంగపేట మండలంలోని కోమటిపల్లి గ్రామానికి చెందిన సుతారి లక్ష్మి ( 60 ) అనే వ్యవసాయ కూలీ ఆదివారం వ్యవసాయ పనులను వెళ్ళింది. ఎండ తీవ్రత ఎక్కువ కావడంతో తాపానికి గురై అస్వస్థకు గురైంది. తోటి వ్యవసాయ కూలీలు లక్ష్మిని స్థానిక ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతి చెందింది. దీంతో కోమటిపల్లిలో విషాద ఛాయలు అలుమ్ముకున్నాయి. వడదెబ్బకు గురైనట్లు స్థానిక గ్రామస్తులు తెలిపారు. మృతురాలుకు కొడుకు కుమార్తె ఉన్నారు.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
