Bandi Bhagirath POCSO SIT Investigation DCP RITHIRAJ
హైదరాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో (POCSO) కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఒక బాలికపై లైంగికదాడి యత్నానికి పాల్పడ్డారనే ఆరోపణలతో హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
* డీసీపీ రితిరాజ్ నేతృత్వం
ఈ కేసుకు ఉన్న ప్రాధాన్యతను దృష్ట్యా, సమగ్ర విచారణ కోసం మాదాపూర్ డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ప్రభుత్వం రంగంలోకి దించింది. డీసీపీ రితిరాజ్ తన టీంతో కలిసి బండి సాయి భగీరథ్‌పై వచ్చిన ఆరోపణలను, ఘటనకు సంబంధించిన సాక్ష్యాధారాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు.
* సీఎం రేవంత్ రెడ్డి సీరియస్..
ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు .. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసుపై తక్షణమే నిష్పక్షపాతంగా విచారణ ప్రారంభించాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆదేశించారు. చట్టం ముందు ఎవరూ అతితీతులు కారని, బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
——–

Please tell us what is wrong. Your report will be sent to the website team.

1 thought on “BANDI BHAGIRATH POCSO CASE | డీసీపీ రితిరాజ్ నేతృత్వం”