SRH VS RCB IPL 2026 Match UPPAL
* ప్రేక్షకులకు సీపీ సుమతి కీలక సూచనలు
* సీట్ల మార్పిడి కుదరదు
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో నేడు (శుక్రవారం) రాత్రి 7:30 గంటలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్లో ఉప్పల్‌లో ఇదే చివరి మ్యాచ్ కావడంతో టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో శాంతిభద్రతలు, ప్రేక్షకుల భద్రత దృష్ట్యా కమిషనర్ ఆఫ్ పోలీస్ (సీపీ) సుమతి కీలక మార్గదర్శకాలు జారీ చేశారు.
* ముఖ్యమైన మార్గదర్శకాలు…
ముందుగానే చేరుకోవాలి: ఆఖరి నిమిషం రద్దీ, తనిఖీల దృష్ట్యా ప్రేక్షకులు మ్యాచ్ ప్రారంభానికి కనీసం ఒకటి లేదా రెండు గంటల ముందే స్టేడియానికి చేరుకోవాలి. ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన సీట్లలోనే కూర్చోవాలి.
* డిజిటల్ గేట్ మ్యాప్…
ప్రేక్షకుల సౌకర్యార్థం జొమాటో డిస్ట్రిక్ట్ (Zomato District) యాప్‌లో డిజిటల్ గేటు మ్యాప్ సదుపాయం కల్పించారు. QR కోడ్ స్కాన్ చేసి కేటాయించిన ఎంట్రీ గేటును సులభంగా చేరుకోవచ్చు.
* నకిలీ, బ్లాక్ టికెట్లపై నిఘా…
ఫేక్ టికెట్ వెబ్సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్టేడియం పరిసరాల్లో బ్లాక్ టికెట్లు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. దీనికోసం ప్రత్యేక నిఘా బృందాలను రంగంలోకి దించారు.
* నిషేధిత వస్తువులు…
బ్యాగులు, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, పవర్ బ్యాంకులు, వాటర్ బాటిళ్లు, బయటి ఆహార పదార్థాలు, లైటర్లు, సిగరెట్లు, ప్లాస్టిక్ వస్తువులను లోపలికి అనుమతించరు. స్టేడియం వద్ద క్లోక్‌రూమ్ సదుపాయం లేదు.
* ట్రాఫిక్ ఆంక్షలు…
ఉప్పల్, నాగోల్ రూట్లలో ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. వాలిడ్ పార్కింగ్ పాస్ ఉన్న వాహనాలనే అనుమతిస్తారు. ప్రేక్షకులు వీలైనంత వరకు మెట్రో, ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలి. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా అదనపు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
* భద్రత & అత్యవసరం…
430కి పైగా సీసీటీవీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంటుంది. మహిళల రక్షణకు ‘షీ టీమ్స్’ అందుబాటులో ఉంటాయి. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే ఎమర్జెన్సీ ఎగ్జిట్ మ్యాప్ చూడాలని లేదా తక్షణమే డయల్ 100కు కాల్ చేయాలని సీపీ సుమతి సూచించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
