India vs Afghanistan Test
* ఇన్నింగ్స్ 300 పరుగుల భారీ విజయం!
ఆకేరు న్యూస్, డెస్క్: ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన ఏకైక టెస్టులో టీమిండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. బ్యాటింగ్‌లో భారీ స్కోరు, బౌలింగ్‌లో కట్టుదిట్టమైన ప్రదర్శనతో అప్ఘనిస్థాన్ను చిత్తు చిత్తుగా ఓడించింది. మూడో రోజే ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
* బ్యాటింగ్‌లో భారత బ్యాటర్ల జోరు
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 564/8 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 126 పరుగులతో ముందుండి నడిపించగా.. కేఎల్ రాహుల్ (100), సాయి సుదర్శన్ (81), రిషభ్ పంత్ (81), వాషింగ్టన్ సుందర్ (52*) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.
భారత టాప్ ఆర్డర్‌తో మొదలైన పరుగుల వరద.. దిగువ వరుస వరకు కొనసాగడంతో అఫ్ఘాన్ బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు.
* రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కుప్పకూలిన అప్ఘాన్
భారీ లక్ష్యాన్ని ఎదుర్కొన్న అప్ఘనిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఫాలోఆన్ ఆడాల్సి వచ్చింది.
రెండో ఇన్నింగ్స్‌లోనూ పరిస్థితి మారలేదు. ఓపెనర్ సెడికుల్లా అటల్ కొంతసేపు పోరాడినా మిగతా బ్యాటర్లు భారత బౌలర్లను ఎదుర్కోలేకపోయారు. చివరకు అఫ్ఘాన్ జట్టు 112 పరుగులకే కుప్పకూలింది.
* సుందర్, కుల్దీప్ మాయాజాలం
రెండో ఇన్నింగ్స్‌లో వాషింగ్టన్ సుందర్ నాలుగు వికెట్లతో చెలరేగగా, కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీసి అఫ్ఘాన్ పతనాన్ని వేగవంతం చేశాడు.
మహ్మద్ సిరాజ్, మానవ్ సుతార్ చెరో వికెట్ పడగొట్టి విజయాన్ని ఖాయం చేశారు.
* అందరి దృష్టిని ఆకర్షించిన మానవ్ సుతార్
ఈ టెస్టుతో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన యువ స్పిన్నర్ మానవ్ సుతార్ తన తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో మరో వికెట్‌తో మొత్తం ఏడు వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు.
అంతర్జాతీయ కెరీర్ ఆరంభ మ్యాచ్‌లోనే ఈ స్థాయి ప్రదర్శన చేయడం విశేషంగా చెప్పుకోవాలి.
* డబ్ల్యూటీసీలో (WTC) శుభారంభం
ఈ ఘన విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2025-27 సైకిల్లో భారత్‌కు కీలక పాయింట్లు లభించాయి. కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో టీమిండియా విజయవంతమైన ఆరంభం చేయడం అభిమానులకు మరింత ఉత్సాహాన్నిస్తోంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
