CJP Centre NEET Talks
* కేంద్రంతో కొలిక్కిరాని CJP చర్చలు
ఆకేరు న్యూస్, డెస్క్:
NEET వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు మరియు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతల మధ్య ఢిల్లీలో జరిగిన కీలక చర్చలు ఎలాంటి ముగింపు లేకుండానే వాయిదా పడ్డాయి. విద్యార్థి నిరసనకారుల తరఫున సీజేపీ కేంద్రం ముందు ప్రతిపాదించిన ప్రధాన మూడు డిమాండ్లపై చర్చ జరిగింది.
చర్చల్లో భాగం నిరసనకారులపై నమోదైన కేసులను ఎత్తివేసేందుకు ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసినట్లు నాయకులు తెలిపారు. అయితే, నీట్ వివాదం నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న బాధితులకు రూ.కోటి చొప్పున పరిహారం అందించడం మరియు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం అనే రెండు ముఖ్య ప్రతిపాదనలపై స్పష్టత రాలేదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నిర్ణయంపై కేంద్రం రేపటి వరకు సమయం కోరింది.
మంత్రి రాజీనామా చేసేవరకు ఉద్యమాన్ని ఆపేది లేదని సీజేపీ స్పష్టం చేస్తూ, రేపు మధ్యాహ్నం మలి విడత చర్చల అనంతరం తమ తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపింది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
