Jalagam Praveen BSP Jangaon District President
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం సముద్రాల గ్రామానికి చెందిన జలగం ప్రవీణ్ ను బిఎస్ పి జనగామ జిల్లా అధ్యక్షుడిగా నియమించినట్లు తెలంగాణ రాష్ట అధ్యక్షులు ఇబ్రాం శేఖర్ నియామాక పత్రాన్ని అందించారు.
2019 నుండి గ్రామస్థాయిలో బహుజన వాదాన్ని బలోపేతం చేస్తూ మండల అధ్యక్షులుగా, నియోజవర్గ అధ్యక్షులుగా పార్టీకి అందిస్తున్న సేవలకు గాను జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు ఇచ్చిన బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట అధ్యక్షులు ఇబ్రాం శేఖర్ ఈ సందర్భంగా ప్రవీణ్ కృతజ్ఞతలు తెలిపాడు.
ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మత మైనార్టీ మరియు అగ్రవర్గాల పేద ప్రజలకు న్యాయం చేసే ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అనీ, యువత రాజకీయాలకు రావాలని పిలుపునిస్తూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు పథకాల పేర్లతో ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు.
సామాజిక సమన్యాయం బీఎస్పీ పార్టీతోనే సాధ్యమని మహనీయుల ఆశయాల కొరకు జిల్లాలో బహుజన వాదం బలోపేతంకై శాయశక్తులా కృషి చేస్తానని తెలియజేశారు.
